KDP: చింతకొమ్మదిన్నె PHCని జిల్లా వైద్యాధికారి డా. నాగరాజు సందర్శించారు. ఇందులో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిబ్బంది పనితీరును సమీక్షించారు. RCH 2.0 ప్రారంభం గురించి తెలియజేశారు. అభా ID నమోదు తప్పనిసరిగా ఉండాలన్నారు. గర్భిణీ సేవలు, టీకాలు, యువిన్ డేటాపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సమన్వయ లోపాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.