ప్రకాశం: చంద్రశేఖర్ పురం మండలంలోని స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలను ఎస్సై వెంకటేశ్వర్ నాయక్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలు ఆత్మ ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పాఠశాలకు ఏడు ఫ్యాన్లు, 10 ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు.