KDP: టి.కోడూరు సమీపంలోని సోలార్ ప్లాంట్లో గుర్తుతెలియని దొంగలు సోలార్ ప్యానెళ్లు సహా విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ మేరకు సేల్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై హృషికేశ్వరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు దాదాపు రూ.3 లక్షల విలువచేసే వస్తువులు అపహరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.