వ్యాయామాలు చేయడం కష్టం కాదు.. డుమ్మా కొట్టకుండా జిమ్‌కు వెళ్లడమే కష్టమైన పని. పరీక్షలంటే భయమనేది నిజం కాదు.. ఫోన్ పక్కన పెట్టి పుస్తకం తెరవడానికి ఇష్టం లేదన్నదే వాస్తవం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం లేకపోవడం కారణం కాదు.. అవసరమైన వ్యాపకాలను త్వజించాలన్న సంకల్పం లేకపోవడమే అసలు సమస్య. ఈ ప్రపంచంలో ఏ పనీ కష్టమైనది కాదు.. పనిని మొదలుపెట్టగలగడమే చాలా మందికి కష్టం.