కామారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ స్కీమ్‌లో విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల వేతనం అందక కుటుంబ పోషణ భారమవుతుందన్నారు. ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి విన్నవించామన్నారు.