ASR: పాడేరు మండలం వంట్ల మావిడి సమీపంలో సోమవారం భారీ వర్షానికి వృక్షం కూలిపోయి రహదారిపై పడిపోయాయి. ఈ ఘటన కారణంగా గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చెట్లు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.