»Mahesh Rajamouli Ready Three Heroines In The Race
Mahesh-Rajamouli : మహేష్-రాజమౌళి రంగం సిద్దం.. రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు!?
Mahesh-Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ గురించి విన్నప్పుడల్లా.. టాలీవుడ్లో హాలీవుడ్ మూవీ అనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఘట్టమనేని ఫ్యాన్స్‌కు. ట్రిపుల్ ఆర్ మూవీతో సంచలనం సృష్టించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని.. హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాంటి జక్కన్న నుంచి రాబోయే ప్రాజెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందోనని.. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు హాలీవుడ్ క్రేజ్ రావడంతో.. తనదైన ప్రమోషన్స్ స్ట్రాటజీతో.. ఏడాది పాటు హాలీవుడ్‌లోనే తిష్ట వేసి ఆస్కార్ కొట్టేశాడు జక్కన్న. నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పనులు అయిపోయినట్టే. మరి ప్రస్తుతం రాజమౌళి ఏం చేస్తున్నారు? పబ్లిక్ మీటింగ్స్‌లలో కూడా ఎక్కువగా కనిపివచడం లేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి.. నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబు కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు జక్కన్న ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లోకి జాయిన్ అయ్యారట. 6 నెలల్లో ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి.. షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఇదిలా ఉంటే.. ఇంకా ఈ సినిమా స్క్రిప్టే కంప్లీట్ అవలేదు.. కానీ అప్పుడే ఫలానా హీరోయిన్లు లైన్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు పక్కన హీరోయిన్ను సెట్ చేసేందుకు సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే ప్రయత్నాలు జరగుతున్నాయి. ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు జోరుగా వినిపించింది. ఇక సెకెండ్ లీడ్‌లో హాలీవుడ్ హీరోయిన్ జెన్నా ఒర్టెగా కనిపించనుందట. ఇక ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఫిక్స్ అయిందనే టాక్ ఊపందుకుంది. అంతేకాదు.. బోనీకపూర్ స్వయంగా రాజమౌళిని రిక్వెస్ట్ చేశారని ట్విట్టర్ టాక్. దీంతో నిజంగానే రాజమౌళి వీళ్లలో ఒకరినే ఫైనల్ చేస్తారా.. లేదంటే ఇంకెవరిని తీసుకుంటారనేది.. సస్పెన్స్‌గా మారింది. మరి రాజమౌళి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.