KDP: ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన బత్తల వెంకటేశ్ (28) ఆదివారం పెన్నానదిలో మునిగి మృతి చెందాడు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజు వివరాల మేరకు.. బత్తల వెంకటేశ్ స్నేహితులతో కలిసి పెన్నానది సమీపంలో డిన్నర్ చేసుకున్నారు. డిన్నర్ తర్వాత ఈతకు వెళ్లారు. వెంకటేశ్ నదిలోనికి వెళ్లగా.. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.