గూగుల్ పే పేమెంట్ యాప్ లో (Google Pay) ఒకప్పుడు మంచి క్యాష్ బ్యాక్ లు (cash back offers) వచ్చేవి. ఇప్పుడు చాలా మందికి అలాంటి క్యాష్ బ్యాక్ ఆపర్లు (cash back offers) రావడం లేదు. వస్తే బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని లేదా అంతగా అవసరం లేని వాటిలో డిస్కౌంట్ ఆఫర్లు (payment apps discount offers) అని వస్తున్నాయి. కానీ తాజాగా కొంతమందికి స్క్రాచ్ చేయగానే వారి ఖాతాల్లో దాదాపు 80వేల రూపాయల వరకు జమ అయ్యాయి. అయితే ఇది క్యాష్ బ్యాక్ ఆఫర్ లేదా ఇతర డిస్కౌంట్ తదితర రూపంలో వచ్చింది కాదు. గూగుల్ పేలో (Google Pay) చిన్న పాటి లోపం కారణంగా ఇలా జరిగింది. ఈ సాంకేతిక లోపం కూడా జరిగింది అమెరికాలో (America). గూగుల్ పే లో లోపం కారణంగా అమెరికాలోని కొందరు పిక్సల్ ఫోన్ యూజర్లకు భారీగా క్యాష్ బ్యాక్ లు వచ్చాయి. పది డాలర్ల నుండి మొదలు పెడితే కొంతమందికి 1000 డాలర్లు కూడా వచ్చాయి.ఈ విషయాన్ని కొందరు యూజర్లు రెడ్డిట్ లో పేర్కొన్నారు.
తాను పదహారు ట్రాన్సాక్షన్స్ జరిపితే పది ట్రాన్సాక్షన్స్ కు క్యాష్ బ్యాక్ వచ్చిందని యూజర్లు చెబుతున్నారు. కొంతమంది వంద డాలర్లు వచ్చాయని, మరికొంతమంది 200 డాలర్లకు పైగా వచ్చాయని, ఇంకొంతమంది 1072 డాలర్లు వచ్చాయని చెబుతున్నారు. అంటే మన కరెన్సీలో ఇది రూ.80వేల వరకు ఉంటుంది. ఈ విషయం తెలియడంతో కొంతమంది గూగుల్ పే లో (Google Pay) తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ యాప్ లోని లోపాన్ని గుర్తించిన గూగుల్ కు చెందిన పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) దానిని సవరించింది. యాప్ లో టెక్నికల్ మార్పులు చేసే క్రమంలో ఈ లోపం తలెత్తినట్లు పేర్కొన్నది. అంతేకాదు, సాంకేతిక లోపం కారణంగా నా ఖాతాలో పడిన డబ్బులను గూగుల్ పే వెనక్కి తీసుకున్నదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించి తనకు సందేశం కూడా వచ్చిందని చెప్పాడు.