విమాన ప్రయాణాల్లో (Flight) ప్రయాణికుల ప్రవర్తన విసుగు తెప్పిస్తోంది. గతంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన (Urine), మరో ఘటనలో దాడి చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వికృత చేష్టలతో తోటి ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా మరో విమానంలో (Plane) అలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ఉండగానే విమానం అత్యవసర ద్వారాన్ని (Emergency Exit) తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనపై ఇండిగో ఎయిర్ లైన్ (Indigo Airlines) ప్రకటించింది.
ఢిల్లీ (New Delhi) నుంచి బెంగళూరు (Bengaluru) వెళ్లేందుకు ప్రతీక్ (40) (Prateek) విమానం ఎక్కాడు. శుక్రవారం ఈ విమానం (6E 308) బయల్దేరగా మద్యంమత్తులో ఉన్న ప్రతీక్ ఎక్కడాడు. ప్రయాణం మధ్యలో అతడు విమానం అత్యవసర ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే కెప్టెన్ ను అప్రమత్తం చేశారు. వెంటనే స్పందించిన మిగతా సిబ్బంది ప్రతీక్ ను నిలువరించారు. ప్రయాణికుడిని అక్కడి నుంచి లోపలికి తీసుకొచ్చారు. అతడిని అడ్డుకుని హెచ్చరించారు. ఇక బెంగళూరులో ల్యాండ్ కాగానే ప్రతీక్ ను పోలీసులకు అప్పగించారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ప్రతీక్ పై కేసు నమోదైంది.