RRR : మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్‌కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు. అలాంటి దర్శకుడి నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుందా.. అని ఎదురు చూస్తున్న వారికి.. ఆస్కార్ అందించి చరిత్రను క్రియేట్ చేశాడు రాజమౌళి.
ఆర్ఆర్ఆర్ సినిమా లెక్కలేనన్నీ అవార్డ్స్ అందుకొని.. ఎన్నో రికార్డ్స్ తన పేరిట రాసుకుంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్‌కి వెళ్తుందని రాజమౌళి కూడా ఊహించలేదు. ఏకంగా ఆస్కార్ కొట్టేసి హిస్టరీ క్రియేట్ చేశాడు రాజమౌళి. నెక్స్ట్ సినిమా కోసం తనకు తానే హాలీవుడ్ రూట్ వేసుకున్నాడు. మహేష్ బాబు ప్రాజెక్ట్‌తో హాలీవుడ్లో సెటిల్ అయిపోయేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఈ ఏడాదిలోనే మహేష్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ట్రిపుల్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టింది.. హాలీవుడ్ స్టార్స్‌ని ఫిదా చేసింది.. ఆస్కార్ కొట్టేసింది.. రిలీజ్ అయి సంవత్సరం దాటిపోయింది.. అయినా కూడా ఇంకా రికార్డ్స్ క్రియేట్ చేస్తునే ఉంది. తాజాగా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది ట్రిపుల్ ఆర్. మూడు దేశాల్లో 100 కోట్లు గ్రాస్ రాబట్టిన సినిమాగా రికార్డు సెట్ చేసింది. ఎలాగు ఇండియాలో 100 కోట్ల రికార్డ్ ఉంది. ఇండియా తర్వాత యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మిలియన్ డాలర్ వసూళ్లు సాధించి 100 కోట్లకి పైగా గ్రాస్ అందుకుంది. ఇక ఇప్పుడు జపాన్‌లో కూడా 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. మామూలుగా అయితే మన సినిమాలు ఇండియాతో పాటు ఓవర్సీస్లో మాత్రమే భారీ కలెక్షన్స్ రాబడుతుంటాయి. కానీ ఇప్పటికీ జపాన్‌లో ట్రిపుల్ ఆర్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ.. 100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. దీంతో మూడు దేశాల్లో 100 కోట్లు గ్రాస్ వసూళ్లు కలిగిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ అరుదైన రికార్డు అందుకుంది. మరి మహేష్ బాబు సినిమాతో జక్కన్న ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.