ATP: అనంతపురం నగరంలోని 38,39 డివిజన్లలో సోమవారం నిర్వహించిన రీకాల్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమంలో నగర మేయర్ వసీం, వైసీపీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి పాల్గొన్నారు. వారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం గురించి ప్రజలకు వివరించారు.