JN: బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లి, పడమటి కేశ్వాపూర్ గ్రామాలలో సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర యువ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.