HNK: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్లో లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 283 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అందజేసిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.