MNCL: ఈనెల 27న సంగారెడ్డిలో జరిగిన ఖేలో ఇండియా సిటీ ఉమెన్స్ లీగ్ బెల్లంపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. లీగ్‌లో 45 కేజీల విభాగంలో అయేషా పాల్గొని 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీరిని పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ నీలు, వుషూ కోచ్ అంబాల శిరీష సోమవారం అభినందించారు. మెడల్ సాధించిన విద్యార్థి సౌత్ జోన్‌కి సెలెక్ట్ అయిందన్నారు.