మేడ్చల్: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య అంతర్గత మురుగు నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పైపులైన్ పనులకు సుమారు రూ.12 లక్షలు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.