రాజ్యసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభను వాయిదా వేస్తూ ఛైర్మన్ ప్రకటన చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ, SIRను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్ష నేతలు నినాదాలు చేశారు. సభలో గందరగోళం సృష్టించటంతో సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. కాగా, రేపు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగనుంది.