BHPL: పలిమెల మండలంలోని సర్వాయిపేట, దమ్మూరు, నీలంపల్లి, బూరుగూడెంలో సోమవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ‘మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫ్రంట్, తెలంగాణ’ పేరుతో వెలువడిన ఈ పోస్టర్లు కలకలం రేపాయి. 40 ఏండ్ల మావోయిస్టు ఉద్యమం ప్రజాదరణ కోల్పోయి బీడుభూమిలా మారిందని, కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడాలని అగ్రనాయకులకు సూచించారు.