NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం నుంచి ఇన్ ఫ్లో పెరుగుతోంది. నిన్న 50 వేల క్యూసెక్కుల నీరు రాగా సోమవారం ఉదయం 9 గంటలకు 68,516 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను ప్రస్తుతం నీటి మట్టం 1072.20 అడుగుల (27.174TMC) నీరు నిల్వ ఉందన్నారు.