కోనసీమ: తంబళ్లపల్లి ఎమ్మెల్యే పి.ద్వారకానంద రెడ్డి ద్రాక్షారామ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి అర్చకులు పూర్ణ కుంభం, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం వైసీపీ కో-ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.