KRNL: ఎమ్మిగనూరు మండలం దేవిబెట్ట గ్రామంలోని శ్రీ ఈశ్వరస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం ఇవాళ భక్తిశ్రద్ధలతో జరిగింది. పూజారులు మూడు రోజుల పాటు పూజలు, హోమాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం హరహర మహాదేవ నినాదాల మధ్య మేళతాళాలతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. గ్రామ పెద్దలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.