కడప-కర్నూలు హైవేపై చెన్నూరు – ఖాజీపేట వెళ్లే మార్గంలో పెన్నా నది వంతెనపై పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పాత వంతెనపై పిల్లర్ల మధ్య పరిస్థితి ఇలా ఉంది. జాతీయ రహదారి విభాగ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.