BHNG: తుర్కపల్లిలో విద్యుత్ షాక్తో పాడి గేద మృతి చెందిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. ఎమ్మార్వో కార్యాలయం పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద గడ్డి మేస్తుండగా కరెంట్ షాక్కు గురై గేదె అక్కడికక్కడే మృతి చెందినట్లు బిచ్చాల ఆంజనేయులు తెలిపారు. లక్ష రూపాయల విలువైన గేదె మృతి చెందడంపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సహాయపడాలని కోరారు.