KRNL: నగరవాసులకు గుక్కెడు నీరు కరవైంది. గత మూడు రోజులుగా మంచినీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సంతోష్‌నగర్ ప్రాంతంలో పైపులు పగలడంతో నీటి సరఫరా నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లతో అందిస్తున్నట్లు నగరపాలక శాఖ అధికారులు ప్రకటించారు. వీధుల్లోకి ట్యాంకర్లు రాక ప్రజలు ఇబ్బంది పడ్డారు. పలు కాలనీల్లో ప్రైవేటు నీటి ట్యాంకర్లను ఆశ్రయించారు.