VKB: వికారాబాద్ మండల మాజీ ఎంపీపీ బురంతపల్లి ప్రమీల గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రమీల మండలంలోని మద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి సర్పంచ్‌గా కూడా సేవలందించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వీబీ తిరుమలయ్యకు కోడలు. కాగా ప్రమీల అంత్యక్రియలు గురువారం ఆమె స్వగ్రామం మద్గుల్ చిట్టెంపల్లిలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.