WGL: మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ భూముల్లో పంటలు వేయొద్దని WGL RDO సత్యపాల్ రెడ్డి ఆదివారం రైతులకు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 11(1) ప్రకారం ప్రాథమిక ప్రకటన, డిక్లరేషన్ ప్రతిపాదనలను కలెక్టర్ ఆమోదించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, పరిహారం చెల్లించకుండా నోటీసులు ఇవ్వడంపై భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.