NLG: ఆధునిక సాగు విధానంలో యువరైతు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాష్ట్రంలోనే తొలిసారిగా వైర్లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాడు. మాడుగులపల్లికి చెందిన యువరైతు మంత్రాల వెంకటరెడ్డి.. తనకున్న 12 ఎకరాల తోటలో తొలిసారి ఆయిల్ ఫామ్ సాగులో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ డ్రిప్ సిస్టమ్ ద్వారా తోటకు 365 రోజులు నీళ్లు, ఎరువులు అందజేయవచ్చు.