JGL: పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని మంగళవారం సూచించారు. గణపతి మండపాల వద్ద ప్యాడ్ బ్యాండ్, డిజేలు నిషేధమని, నిబంధనలు అతిక్రమిస్తే మండపాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో అల్లర్లకు పాల్పడిన సుమారు 100 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్లు తెలిపారు.