WGL: నేడు మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖల మంత్రిత్వ శాఖలు మారనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న కొండా సురేఖ శాఖలు మారుస్తారనే చర్చ నడుస్తోంది. మంత్రి పదవి కోసం జిల్లా నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.