NLR: నాయకులు, కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోతేనే టీడీపీ బలపడుతుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ అన్నారు. వేంపాడు, రామాపురం, వరికుంటపాడు పంచాయతీలో గ్రామ కమిటీల సమావేశం బుధవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు. పార్టీ పదవులపై సమీక్షించారు.