NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం అల్లూరు పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం పట్టణంలోని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సాయంత్రం 3గంటలకు ప్రారంభిస్తారని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.