అన్నమయ్య: రాజంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ నెల 23న ఉదయం 10 గంటలకు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు మీడియా కో-ఆర్డినేటర్ చింతల శివ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.