పాకిస్తాన్ లో (Pakistan) పరిస్థితి తీవ్ర దయానీయంగా ఉన్నది. మార్చి నెలలో ఇక్కడ రిటైల్ ద్రవ్యోల్భణం (Retail inflation) 35.4 శాతం పెరిగింది. 1965 తర్వాత ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇక్కడి ఆహార పదార్థాల ధరలు (Consumer price inflation) భారీగా పెరిగినట్లు పాకిస్తాన్ కు చెందిన బిజినెస్ రికార్డర్ తెలిపింది. బ్రెడ్, ఇతర ఆహార పదార్థాల కోసం వరుసలో నిలబడి, ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ద్రవ్యోల్భణంను (Inflation) తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలు సరిపోవడం లేదు. ఈ కారణంగా గత అరవై ఏళ్లలో ఏ సంవత్సరంలో కనిపించని ద్రవ్యోల్భణం కనిపించింది. రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ బ్యూరో ఆఫ్ స్టాటిక్స్ కూడా ద్రవ్యోల్భణం పెరుగుదలను అంగీకరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (international monetary fund) నుండి బెయిలౌట్ ప్యాకేజీని (pakistan imf bailout package) పొందేందుకు పాక్ ప్రభుత్వం (pak government) ప్రయత్నాలు చేస్తోంది.
పాక్ రిటైల్ ద్రవ్యోల్భణం ఆర్థిక ఏడాదిలో జూన్ నుండి జనవరి వరకు 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఏకంగా 31.6 శాతం, మార్చిలో 35 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 12.7 శాతం మాత్రమే. రాజకీయ అస్థిరత, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు రిటైల్ ద్రవ్యోల్భణం మరింత ఇబ్బందికరంగా మారింది. పాక్ లో అంతులేకుండా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు వ్యాపార వర్గాలు సిద్ధమయ్యాయి. అయితే రంజాన్ తర్వాత నుండి చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు ఎంత మేరకు సఫలమవుతాయో చూడాల్సి ఉంది.
ఏడాదిలో ఫుడ్, బీవరేజెస్, ట్రాన్సుపోర్ట్ ఖర్చులు ( food, beverage and transport prices) అయితే ఏకంగా 50 శాతం పెరిగాయి. వార్షిక ఆహార ద్రవ్యోల్భణం (Annual food inflation) పట్టణ ప్రాంతంలో 47.1 శాతం, గ్రామీణంలో 50.2 శాతం ఉన్నది. ద్రవ్యోల్భణం (inflation) పెరుగుతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ (cost of living) కూడా పెరుగుతున్నట్లే. ఇది అక్కడి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వివిధ ఆహార ఉత్పత్తుల ధరలను గత ఏడాదితో పోలిస్తే.. ఉల్లి 257 శాతం, టీ 105 శాతం, గోధుమలు 94 శాతం, గుడ్లు 84 శాతం, బియ్యం 82.5 శాతం, వీట్ ఫ్లోర్ 70 శాతం, గ్రామ్ వోల్ 65 శాతం, పల్స్ మూంగ్ 58 శాతం, బేసన్ 53.5 శాతం, కుకింగ్ ఆయిల్ 53.5 శాతం, పండ్లు 51.3 శాతం, డ్రై ఫ్రూట్స్ 48 శాతం పెరిగాయి. నాన్ – ఫుడ్ కేటగిరీలో చూస్తే టెక్స్ట్ బుక్స్ ధరలు 75 శాతం, మోటార్ ఫ్యూయల్ 72 శాతం, స్టేషనరీ 67 శాతం, గ్యాస్ ఛార్జీలు 62.8 శాతం, మోటార్ వెహికిల్స్ 45.5 శాతం, హౌస్ హోల్డ్ ఎక్విప్ మెంట్స్ 42 శాతం పెరిగాయి.