NLR: ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం ఎస్టి కాలనీలో శుక్రవారం కిశోరి వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మంజుల మాట్లాడుతూ.. రక్తహీనత ఉన్న వారిలో రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వలన అలసట, నీరసం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. వీటిని అరికట్టడానికి ఎక్కువగా గుడ్డు, ఆకు కూరలు, పండ్లు తీసుకోవాలన్నారు. రక్తహీనత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.