MDK: నర్సాపూర్ కోర్టు ఆవరణలో శుక్రవారం జూనియర్ సివిల్ జడ్జ్ హేమలత, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి శంభవల్లి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19 వరకు కొనసాగుతున్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజి పడే కేసుల్లో ఇరువర్గాలను రాజీ కుదిరించి పరిష్కరించాలని సూచించారు.