TPT: డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా లేకపోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని సత్యవేడు మండలం దాసుకుప్పం PHC వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకుని వ్యాధి నివారణ పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు.