WGL: వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారదాదేవి వర్ధన్నపేట మండలంలో పర్యటించారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ అమలవుతున్న ల్యాబర్తి గ్రామాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన భూభారతి సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని రైతులకు, స్థానికులకు చట్టంపై అవగాహన కల్పించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.