BPT: చిలకలూరిపేటలో మాజీ మంత్రి, బీసీ మహిళ అయిన విడదల రజినిపై సీఐ దౌర్జన్యానికి దిగటం దుర్మార్గపు చర్య అని అద్దంకి వైసీపీ సమన్వయకర్త హనిమిరెడ్డి శనివారం ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. ఒక సీఐ మాజీ మంత్రి మీద దౌర్జన్యం చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.