టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటనకు BCCI సెలక్షన్ కమిటీ ముహూర్తం ఖరారు చేసింది. మే 23న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుతో పాటు టెస్టు కెప్టెన్ను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక భారత టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ పేరును BCCI దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.