మేడ్చల్: దేశంకోసం పోరాడుతున్న భారత సైనికులకు చూసి గర్వ పడుతున్నామని మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్లో ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటున్న దేశ సైనికులకు శనివారం సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రులు చామకూర మల్లారెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యే కేపీ వివేకానందలు ఆపరేషన్ సింధూర్లో సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు.