MHBD: కొత్తగూడ మండలం పెగడపల్లి శివారులో ఆదివారం రాత్రి ద్వి చక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మద్దెల ప్రకాష్ అనే బిఎస్ఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు.