NLR: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉలవపాడు మామిడి మార్కెట్లోకి వచ్చింది. నోరూరించే మధురమైన ఫలం ఈ ఏడాది అలస్యమైంది. ఈనెల మొదటివారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉలవపాడు బంగినపల్లికి ఉన్న క్రేజ్, డిమాండ్ కారణంగా వాటి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఉలవపాడు ప్రాంతంలో ప్రస్తుతం బంగినపల్లి కేజీ రూ.100, పెద్ద రసాలు కేజీ రూ.120లుగా ఉన్నాయి.