ELR: ముసునూరు గ్రామంలో ఈదురు గాలులు వర్షానికి విరిగిపడిన చెట్టు కారణంగా 10 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా బాల గోవిందం అనే బాలుడు నిద్రిస్తుండగా ఆరు బయట ఉన్న వెలగ చెట్టు ఈదురు గాలులకు విరిగిపడింది. ఈ సంఘటనలో బాల గోవిందం తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.