NRML: దిలావర్పూర్ మండలం శ్రీ కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ గా అంగూరి మహేందర్‌ను నియమిస్తున్నట్లు ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ చైర్మన్‌గా ఎన్నికైన మహేందర్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, తనపై నమ్మకంతో అధ్యక్షునిగా నియమించిన DCC అధ్యక్షులు శ్రీహరి రావు, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.