VZM: ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే గిరిజన యువత ప్రాణాలకు రక్షణ కల్పించాలని పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శనివారం జిల్లా OBC చైర్మన్ వంగల దాలి నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధి కోసం వలస వెళ్లి రొయ్యల చెరువులో విద్యుత్ షాక్కు గురై ప్రశాంత్, కిరణ్ మృతి చెందడం బాధాకరం అన్నారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.