SRPT: కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నడిగుడెం గ్రామానికి చెందిన వట్టె సతిష్ గొర్రె పిల్లలు మేతకు గ్రామ వెలుపలకు వెళ్లగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో 31 గొర్రె పిల్లలు చనిపోయాయని, వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు.