KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరావు, డీఎల్పిఓ నూర్జహాన్ తదితర అధికారులు పాల్గొన్నారు.