KDP: ఏపీ కూటమి ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ను జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువతో సత్కరించారు. పార్నపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు.