KMM: ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ నిధులు సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై సమగ్రంగా సమాచారం అందిస్తే ఫాలో అప్ చేయడం జరుగుతుందని చెప్పారు. అటు జిల్లాలో జరుగనున్న అభివృద్ధి పనులపై చర్చించారు.