W.G: పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తూ తన వంతు సహకారం మరువలేనిదని అన్నారు.